సుమధుర స్వరముల గానాలతో
Sumadhura Svaramula Ganalato
సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన || 2 || మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం || 2 || ||సుమధుర|| ఎడారి త్రోవలో నే నడచినా – ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా || 2 || నీవే నీవే నా ఆనందము (నీవే) నీవే నా ఆధారము || 2 || ||సుమధుర|| సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా || 2 || నీవే నీవే నా జయగీతము (నీవే) నీవే నా స్తుతిగీతము || 2 || ||సుమధుర|| వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా || 2 || నీవే నీవే నా అతిశయము (నీకే) నీకే నా ఆరాధన || 2 || ||సుమధుర||
sumadhura svaramula ganalato - veladi dutala galamulato koniyadabaduchunna na yesayya - nike na aradhana || 2 || mahadanandame nalo paravasame ninnu stutinchina pratiksanam || 2 || ||sumadhura|| edari trovalo ne nadachina - erugani margamulo nanu nadipina na mundu nadachina jayaviruda - na vijaya sanketama || 2 || nive nive na anandamu (nive) nive na adharamu || 2 || ||sumadhura|| sampurnamaina ni chittame - anukulamaina sankalpame jariginchuchunnavu nanu viduvaka - na dhairyamu nivega || 2 || nive nive na jayagitamu (nive) nive na stutigitamu || 2 || ||sumadhura|| veladi nadulanni ni mahimanu - tarangapu pongulu ni balamunu parvata srenulu ni kirtine - prakatinchuchunnavega || 2 || nive nive na atisayamu (nike) nike na aradhana || 2 || ||sumadhura||