అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
Atyunnata Sinhasanamupai Asinuda
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా || 2 || ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే || 2 || ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో || 2 || ||అత్యున్నత|| పరిమలించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే || 2 || పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్ష ధ్వనులతో – హర్ష ధ్వనులతో || 2 || ||అత్యున్నత|| పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే || 2 || యెహోవ నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో – స్తుతి గీతాలతో || 2 || ||అత్యున్నత||
atyunnata sinhasanamupai asinuda deva dutalu aradhinchu parisud'dhuda yesayya na niluvella nindiyunnavu na manasara ni sannidhilo sagilapadi namaskaramu cheseda sagilapadi namaskaramu cheseda || 2 || prati vasantamu ni daya kiritame prakrti kalalanniyu ni mahimanu vivarinchune || 2 || prabhuva ninne aradhincheda krtajnatarpanalato - krtajnatarpanalato || 2 || ||atyunnata|| parimalinchune na saksya jivitame parisud'dhatmudu nannu nadipinchuchunnandune || 2 || parisud'dhatmalo anandincheda harsa dhvanulato - harsa dhvanulato || 2 || ||atyunnata|| paksi rajuvai ni rekkalapai mositive nive na tandrive na badhyatalu bharinchitive || 2 || yehova ninne mahima paracheda stuti gitalato - stuti gitalato || 2 || ||atyunnata||