వేటగాని ఉరిలో నుండి

Vetagani Urilo Nundi

26 Dec 2025

వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు || 2 || లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన || 2 || రాత్రి వేళ భయముకైననూ పగటి వేళ బాణమైననూ || 2 || రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు || 2 || ||లేనే లేదయ్యా|| వేయిమంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా || 2 || అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు || 2 || ||లేనే లేదయ్యా|| మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు || 2 || రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు || 2 || ||లేనే లేదయ్యా||


vetagani urilo nundi na prananni raksinchavu balamaina rekkala krinda nakasrayamichchavu || 2 || lene ledayya vere adharam na durgama na sailama lene ledayya vere adharam na srngama na kedema aradhana aradhana - na tandri nike aradhana aradhana aradhana - na yesu nike aradhana || 2 || ratri vela bhayamukainanu pagati vela banamainanu || 2 || rogamu nannemi cheyadu na gudaramu samipinchadu || 2 || ||lene ledayya|| veyimandi padipoyina padivela mandi kulipoyina || 2 || apayamu rane radu na gudaramu samipinchadu || 2 || ||lene ledayya|| manavulanu kapadutaku ni dutalanu erparichavu || 2 || rayi tagalakunda etti nannu pattukunnavu || 2 || ||lene ledayya||