దీవించావే సమృద్ధిగా

Divincave Samrddhiga

P Satish Kumar 27 Dec 2025

దీవించావే సమృద్ధిగా – నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా – నీ కోసమే నను బ్రతకమని దారులలో.. ఎడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా.. చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా.. ||దీవించావే|| నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే || 2 || ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే.. శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని.. ||దీవించావే|| కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా || 2 || ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే.. పోరులలో.. పోరాటములో.. నా పక్షముగానే నిలిచావే.. ||దీవించావే||


divinchave samrd'dhiga - ni saksiga konasagamani preminchave nanu prananga - ni kosame nanu bratakamani darulalo.. edarulalo.. selayerulai pravahinchumaya.. chikatilo.. karu chikatilo.. agni stambhamai nanu nadupumaya.. ||divinchave|| nuvve lekunda nenundalenu yesayya ni preme lekunda jivinchalenu nenayya na ontari payananlo na jantaga nilichave ne nadiche darullo na todai unnave || 2 || uhalalo.. na usulalo.. na dhyasa basavainave.. sud'dhatalo.. parisud'dhatalo.. ninu poli nannila sagamani.. ||divinchave|| kolate ledayya ni jali napai yesayya korate ledayya samrd'dhi jivam nivayya na kanniranta tudichave kannatallila koduvanta tirchave kannatandrila || 2 || asalalo.. nirasalalo.. nenunna nikani annave.. porulalo.. poratamulo.. na paksamugane nilichave.. ||divinchave||