ఆనందం నీలోనే
Anandam Nilone
ఆనందం నీలోనే – ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడు అర్హతేలేని నన్ను – ప్రేమించినావు జీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై ||ఆనందం|| పదే పదే నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే ధ్యాసగా || 2 || కలవరాల కోటలో – కన్నీటి బాటలో || 2 || కాపాడే కవచంగా – నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా – స్తోత్రగీతమా ||ఆనందం|| నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని || 2 || నీ సన్నిధి వీడక – సన్నుతించి పాడనా || 2 || నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా సత్యవాక్యమే – జీవవాక్యమే ||ఆనందం|| సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై || 2 || లోక మహిమ చూడక – నీ జాడలు వీడక || 2 || నీతోనే నిలవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం – నా ఆశయం ||ఆనందం||
anandam nilone - adharam nivega asrayam nilone - na yesayya - stotrar'hudu ar'hateleni nannu - preminchinavu jivintu ilalo - ni kosame - saksyarthamai ||anandam|| pade pade ninne cheraga pratiksanam nive dhyasaga || 2 || kalavarala kotalo - kanniti batalo || 2 || kapade kavachanga - nannu avarinchina divyaksetrama - stotragitama ||anandam|| nirantaram nive velugani nityamaina svasthyam nidani || 2 || ni sannidhi vidaka - sannutinchi padana || 2 || nikorake dhvajametti ninna prakatinchana satyavakyame - jivavakyame ||anandam|| sarvasatyame na margamai sanghaksemame na pranamai || 2 || loka mahima chudaka - ni jadalu vidaka || 2 || nitone nilavali nitya siyonulo i darsanam - na asayam ||anandam||