నిబ్బరం కలిగి ధైర్యముగుండు

Nibbaram Kaligi Dhairyamugundu

Anil Kumar 28 Oct 2025

నిబ్బరం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు || 2 || నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా ||నిబ్బరం|| పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా || 2 || ప్రభు కృప మమ్మును విడువడుగా || 2 || ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము ||హల్లెలూయా|| మునుపటి కంటెను – అధికపు మేలును || 2 || మా ప్రభు మాకు కలిగించును || 2 || రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును శత్రువు ఎదుటనే భోజనమిచ్చును ప్రభువే మా ధ్వజము ||హల్లెలూయా|| మా అంగలార్పును – నాట్యముగా మార్చెను బూడిద బదులు సంతోషమిచ్చెను || 2 || దుఃఖ దినములు సమాప్తమాయెను ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను ప్రభునకే స్తోత్రం ||హల్లెలూయా|| స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును || 2 || మా ప్రభు మమ్మును మరువడుగా || 2 || చూడుము నా అరచేతిలనే చెక్కితి నిను అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకొనును ||హల్లెలూయా|| రాబోవు కాలమున – సమాధాన సంగతులే || 2 || మా ప్రభు మాకై ఉద్దేశించెను || 2 || ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను ఇప్పుడే అది మొలుచున్ ||హల్లెలూయా|| మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను || 2 || మా ప్రభు మాకు అందించును || 2 || ప్రాకారముగల పట్టణములోనికి ప్రభువే మమ్మును నడిపింపచేయును ప్రభువే మా పురము ||హల్లెలూయా||


nibbaram kaligi dhairyamugundu digulu padaku jadiyaku eppudu || 2 || ninnu viduvadu ninnu maruvadu prabhuve ni todu halleluya amen - halleluya uraka nilichi prabhuvu chupe - raksana chuddamu ni satruvulu ikapai eppudu - kanabadarannadu halleluya amen - halleluya ||nibbaram|| parvatalu tolagina - mettalu tattarillina || 2 || prabhu krpa mam'munu viduvaduga || 2 || ekkaleni ettaina kondanu ekkinchunu ma prabhu krpa mam'munu prabhuve ma balamu ||halleluya|| munupati kantenu - adhikapu melunu || 2 || ma prabhu maku kaliginchunu || 2 || rettimpu ghanatato ma talanu ettunu satruvu edutane bhojanamichchunu prabhuve ma dhvajamu ||halleluya|| ma angalarpunu - natyamuga marchenu budida badulu santosamichchenu || 2 || duhkha dinamulu samaptamayenu ullasa vastramu dhariyimpa chesenu prabhunake stotram ||halleluya|| stri tana biddanu - marachina marachunu || 2 || ma prabhu mam'munu maruvaduga || 2 || chudumu na arachetilane chekkiti ninu annadu prabhuvu prabhuve chuchukonunu ||halleluya|| rabovu kalamuna - samadhana sangatule || 2 || ma prabhu makai uddesinchenu || 2 || idigo nenoka nutana kriyanu cheyuchunnanani ma prabhuvu cheppenu ippude adi moluchun ||halleluya|| memu kattani phuramulanu - mem natani totalanu || 2 || ma prabhu maku andinchunu || 2 || prakaramugala pattanamuloniki prabhuve mam'munu nadipimpacheyunu prabhuve ma puramu ||halleluya||