జుంటె తేనె ధారల కన్నా

Junte Tene Dharala Kanna

Hosanna Ministries 28 Oct 2025

జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను || 2 || జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా || 2 || ||జుంటె తేనె|| యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి || 2 || నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే || 2 || ||జుంటె తేనె|| యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి || 2 || నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే || 2 || ||జుంటె తేనె|| యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నను మార్చి || 2 || నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే || 2 || ||జుంటె తేనె||


junte tene dharala kanna yesu namame madhuram yesayya sannidhine maruvajalanu || 2 || jivitakalamanta anandincheda yesayyane aradhincheda || 2 || ||junte tene|| yesayya namame bahu pujaniyamu napai drsti nilipi santrustiga nanu unchi || 2 || nannentagano divinchi jivajalapu utalato ujjivimpajesene || 2 || ||junte tene|| yesayya namame balamaina durgamu na todai nilichi ksemamuga nanu dachi || 2 || nannentagano karuninchi pavitra lekhanalato uttejimpajesene || 2 || ||junte tene|| yesayya namame parimala tailamu nalo nivasinche suvasanaga nanu marchi || 2 || nannentagano preminchi vijayotsavalato uregimpajesene || 2 || ||junte tene||