స్థిరపరచువాడవు బలపరచువాడవు

Sthiraparacuvadavu Balaparacuvadavu

Daniel Praneeth 14 Dec 2025

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు || 2 || ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు || 2 || యేసయ్యా.. యేసయ్యా .. నీకే నీకే సాధ్యము || 2 || సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది || 2 || మా దేవా నీ ఆలోచనలన్ని ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి || 2 || ||ఏమైనా|| నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా నీ కంచె దాటగ శత్రువుకు సాధ్యమా || 2 || మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్ని మేలైపోవును || 2 || ||ఏమైనా||


sthiraparachuvadavu balaparachuvadavu padipoyina chote nilabettuvadavu ghanaparachuvadavu hechchinchuvadavu ma paksamu nilichi jayamichchuvadavu || 2 || emaina cheyagalavu katha mottam marchagalavu ni namamuke mahimanta techchukunduvu || 2 || yesayya.. yesayya .. nike nike sadhyamu || 2 || sarvakrpanidhi ma parama kum'mari ni chetilone ma jivamunnadi || 2 || ma deva ni alochanalanni ento goppavi ma uhaku minchina karyamulenno jariginchuchunnavi || 2 || ||emaina|| ni ajna lenide edaina jaruguna ni kanche dataga satruvuku sadhyama || 2 || ma deva nive ma todunte ante chalunu apavadi talachina kidulanni melaipovunu || 2 || ||emaina||