నడిపించు నా నావా
Nadipincu Na Nava
నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు|| నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు|| రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు|| ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు|| ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట ||నడిపించు|| లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు|| ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ||నడిపించు||
nadipinchu na nava nadi sandramuna deva nava jivana margamuna na janma tariyimpa ||nadipinchu|| na jivita tiramuna na apajaya bharamuna naligina na hrdayamunu nadipinchumu lotunaku na yatma virabuya na diksa phaliyimpa na navalo kalidumu na seva chekonumu ||nadipinchu|| ratrantayu sramapadina raledu prabhu jayamu rahadarulu vedakinanu radayenu pratiphalamu raksinchu ni siluva ramaniya lotulalo ratanalanu vedakutalo rajillu na padava ||nadipinchu|| atmarpana cheyakaye asinchiti ni chelimi ahamunu preminchuchune arasiti prabhu ni kalimi asa nirasaye avedaneduraye adhyatmika lemigani allade navalalu ||nadipinchu|| prabhu margamu vidachitini prarthinchuta manitini prabhu vakyamu vadalitini paramarthamu marachitini prapancha natanalalo pravinyamunu bondi phalahinudanai yipudu patintu ni mata ||nadipinchu|| lotaina jalamulalo lotuna vinabadu svarama lobadutanu nerpinchi lopambulu savarinchi lonunna ivulalo lotaina na bratuku lopinchani arpanaga lokesa cheyumaya ||nadipinchu|| prabhu yesuni sisyudanai prabhu premalo padukoni prakatintunu lokamulo parisud'dhuni prema katha paramatma proksanato paripurna samarpanato pranambunu prabhu koraku panarpanamu chetu ||nadipinchu||