హే ప్రభుయేసు హే ప్రభుయేసు
He Prabhuyesu He Prabhuyesu
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా – పాపహరా – శాంతికరా ||హే ప్రభు|| శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ || 2 || శాంతి స్వరూపా జీవనదీపా || 2 || శాంతి సువార్తనిధీ ||సిల్వధరా|| తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా || 2 || విఫలులు చేసిన విజ్ఞాపనలకు || 2 || సఫలత నీవెగదా ||సిల్వధరా|| మతములు వెదకిన నిన్నెకదా వ్రతములుగోరిన నిన్నెగదా || 2 || పతితులు దేవుని సుతులని నేర్పిన || 2 || హితమతి వీవెగదా ||సిల్వధరా|| పలుకులలో నీ శాంతికధ తొలకరి వానగా కురిసెగదా || 2 || మలమల మాడిన మానవ హృదయము || 2 || కలకలలాడె కదా ||సిల్వధరా|| కాననతుల్య సమాజములో హీనత జెందెను మానవత || 2 || మానవ మైత్రిని సిల్వ పతాకము || 2 || దానము జేసెగదా ||సిల్వ ధరా|| దేవుని బాసిన లోకములో చావుయే కాపురముండె గదా || 2 || దేవునితో సఖ్యంబును జగతికి || 2 || యీవి నిడితివి గదా ||సిల్వ ధరా|| పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండె గదా || 2 || దాపున జేరి పాపిని బ్రోచిన || 2 || కాపరి వీవెగదా ||సిల్వ ధరా|| ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ జేసిన నీవే గదా || 2 || ఖలమయుడగు సాతానుని గర్వము || 2 || ఖండనమాయె గదా ||సిల్వ ధరా|| కలువరిలో నీ శాంతి సుధా సెలయేరుగ బ్రవహించె గదా || 2 || కలుష ఎడారిలో కలువలు పూయుట || 2 || సిలువ విజయము గదా ||సిల్వ ధరా||
he prabhuyesu he prabhuyesu he prabhu devasuta silvadhara - papahara - santikara ||he prabhu|| santi samadhanadhipati svantamulo prasantanidhi || 2 || santi svarupa jivanadipa || 2 || santi suvartanidhi ||silvadhara|| tapamulu tarachina ninnegada japamulu golichina ninnegada || 2 || viphalulu chesina vijnapanalaku || 2 || saphalata nivegada ||silvadhara|| matamulu vedakina ninnekada vratamulugorina ninnegada || 2 || patitulu devuni sutulani nerpina || 2 || hitamati vivegada ||silvadhara|| palukulalo ni santikadha tolakari vanaga kurisegada || 2 || malamala madina manava hrdayamu || 2 || kalakalalade kada ||silvadhara|| kananatulya samajamulo hinata jendenu manavata || 2 || manava maitrini silva patakamu || 2 || danamu jesegada ||silva dhara|| devuni basina lokamulo chavuye kapuramunde gada || 2 || devunito sakhyambunu jagatiki || 2 || yivi niditivi gada ||silva dhara|| papamu chesina strini gani papula kopamu mande gada || 2 || dapuna jeri papini brochina || 2 || kapari vivegada ||silva dhara|| khali samadhilo maranamunu khaidiga jesina nive gada || 2 || khalamayudagu satanuni garvamu || 2 || khandanamaye gada ||silva dhara|| kaluvarilo ni santi sudha selayeruga bravahinche gada || 2 || kalusa edarilo kaluvalu puyuta || 2 || siluva vijayamu gada ||silva dhara||