లాలి లాలి జోలాలి

Lali Lali Jolali

14 Dec 2025

లాలి లాలి జోలాలి – బాల యేసునకు లాలి కన్య మరియా తనయునకు – పాడ రండి జోలాలి || 2 || లోక రక్షకునకు లాలి – శాంతి కర్తకు జోలాలి || 2 || మాదు తండ్రికి మా లాలి || 2 || ||లాలి|| చీకటి దొంతరల తెరలకు – తెరను దింపగా వచ్చినావని పాప శాపపు తాపములకు – రక్షణను ఇల తెచ్చినావని || 2 || మానవుల మోచకుడా లాలి – ధరణిఁ పై దైవమా జోలాలి || 2 || మాదు తండ్రికి మా లాలి || 2 || ||లాలి|| దారి తెలియని మానవాళికి – దారి నీవై వెలసినావని మరణ ఛాయలు రూపుమాపగ – జీవ కిరణమై మెరిసినావని || 2 || సత్య రూపునకు లాలి – నీతి సూర్యునకు జోలాలి || 2 || మాదు తండ్రికి మా లాలి || 2 || ||లాలి||


lali lali jolali - bala yesunaku lali kan'ya mariya tanayunaku - pada randi jolali || 2 || loka raksakunaku lali - santi kartaku jolali || 2 || madu tandriki ma lali || 2 || ||lali|| chikati dontarala teralaku - teranu dimpaga vachchinavani papa sapapu tapamulaku - raksananu ila techchinavani || 2 || manavula mochakuda lali - dharanim pai daivama jolali || 2 || madu tandriki ma lali || 2 || ||lali|| dari teliyani manavaliki - dari nivai velasinavani marana chhayalu rupumapaga - jiva kiranamai merisinavani || 2 || satya rupunaku lali - niti suryunaku jolali || 2 || madu tandriki ma lali || 2 || ||lali||