కల్వరిలోన చేసిన యాగం

Kalvarilona Cesina Yagam

Sayaram Gattu 28 Oct 2025

కల్వరిలోన చేసిన యాగం మరణము గెలిచిన నీ యొక్క త్యాగం || 2 || కడిగి వేసెను నాదు పాపం నిలిపె నాలో నీ స్వరూపం || 2 || ||కల్వరిలోన|| ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలు తొలగించే నాపై ఉన్న ఆ ఘోర శాపాలు పరిశుద్ధ దేహముపై చెలరేగెను కొరడాలు నాలోని రోగాలకై పొందితివా గాయాలు || 2 || దైవ సుతుడవే అయిన గాని కనికరము వీడవు ఏల క్షణమైనా గాని || 2 || ||కల్వరిలోన|| ఏ దోషం లేని దేహం మోసెను సిలువ భారం రద్దాయెను నాలో నేరం తగ్గించెను నా భారం నువ్వు పొందిన అవమానం నను ఉన్నతి చేర్చెను చిందించిన నీదు రక్తం పరిశుద్ధుని చేసెను || 2 || నిన్నే బలిగా నువ్వు మార్చుకుంటివి నన్ను రక్షించుటకు వేదన పడితివి || 2 || ||కల్వరిలోన|| సిలువలో వ్రేలాడుతూ నువ్వు పొందిన దాహము అందించేను నా కొరకై ఆ జీవ జలము కఠినులుగా మారి నీకు అందించిన ఆ చేదు నింపేను నాలో మధురం తొలగించే నా కుటిలం || 2 || అధికారమే లేని మరణము నిలిచెను నిన్ను తాకేందుకు అనుమతి కోరెను || 2 || ||కల్వరిలోన||


kalvarilona chesina yagam maranamu gelichina ni yokka tyagam || 2 || kadigi vesenu nadu papam nilipe nalo ni svarupam || 2 || ||kalvarilona|| a papulu alupe leka ninu kottina debbalu tolaginche napai unna a ghora sapalu parisud'dha dehamupai chelaregenu koradalu naloni rogalakai ponditiva gayalu || 2 || daiva sutudave ayina gani kanikaramu vidavu ela ksanamaina gani || 2 || ||kalvarilona|| e dosam leni deham mosenu siluva bharam raddayenu nalo neram tagginchenu na bharam nuvvu pondina avamanam nanu unnati cherchenu chindinchina nidu raktam parisud'dhuni chesenu || 2 || ninne baliga nuvvu marchukuntivi nannu raksinchutaku vedana paditivi || 2 || ||kalvarilona|| siluvalo vreladutu nuvvu pondina dahamu andinchenu na korakai a jiva jalamu kathinuluga mari niku andinchina a chedu nimpenu nalo madhuram tolaginche na kutilam || 2 || adhikarame leni maranamu nilichenu ninnu takenduku anumati korenu || 2 || ||kalvarilona||