ఎవరు చూపించలేని
Evaru Cupincaleni
ఎవరు చూపించలేని – ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది – ఇంతగా కోరుకుంది – మరువను యేసయ్యా || 2 || నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా ||ఎవరు|| తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక – నీ కొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన – నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ – అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా – ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా – యేసయ్యా నీవెగా ||ఎవరు|| ఈ లోక జీవితాన – వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం – వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు – సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే – నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన – నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన – నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో – సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా – నిలిచె నా యేసయ్యా ||ఎవరు||
evaru chupinchaleni - ilalo nanu vidiponi entati prema nidi - intaga korukundi - maruvanu yesayya || 2 || ni kathe nanne takaga - na made ninne cheraga na gure nivai yundaga - ni dare ne cheranuga ||evaru|| tirale duramaye - kalale maripoye eduraina endamave - kanniti kanukaye na gunde lotulona - ne naligipotuvunna e dari kanaraka - ni koraku vechivunna edabatuleni gamanana - ninu cherukunna samayana nanu adarinche ghana prema - apurupamaina toliprema ekamai toduga - upire nivuga evvaru leruga - yesayya nivega ||evaru|| i loka jivitana - vesaripotuvunna viluvaina nidu vakyam - veliginche na pranam ni sannidhanamandu - siyonu margamandu ni divya sevalone - nadipinche na prabhu ni toti sagu payanana - nanu vidaledu ksanamaina ni svaramu chalu udayana - ninu vembadinchu tarunana sasvata premato - satyavakyambuto nityamu toduga - niliche na yesayya ||evaru||