కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
Kummari O Kummari Jagatutpattidari
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా పనికిరాని పాత్రనని – పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా || 2 || సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి|| విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి || 2 || ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి|| లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్ మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని || 2 || పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్ ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
kum'mari o kum'mari jagatutpattidari jigata mannaina na vanka challaga chudumayya a a a challaga chudumayya panikirani patranani - paraveyakuma pongi poralu patraga - nannu nimpuma || 2 || suvartaloni patralanni - sri yesuni pogaduchunda saksiganundu patragajesi - satyamuto nimpumu tandri a a a satyamuto nimpumu tandri ||kum'mari|| viluvaleni patranu nenu - konuvaru lerevvaru velaleni nidu raktambuto - velugondu patragajesi || 2 || atankamulanundi tappinchi nannu - ellappudu kavumayya pagiliyunna patranu nenu - sarichesi vadumayya a a a sarichesi vadumayya ||kum'mari|| lokasato nindi upponguchu - margambu ne dappitin manusechchhalanniyu sthiramanuchune - manassanti kolpotini || 2 || pogottukunna patrayanuchu - parugetti nanu pattitivi pranambu nalo unnappude - ni padambul pattitin a a a ni padambul pattitin ||kum'mari||