వందనంబొనర్తుమో
Vandanambonartumo
వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో ||వందనం|| ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి ఎపుడు గాచియు ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రములివిగో ||వందనం|| ప్రాత వత్సరంపు బాప మంతయు బ్రీతిని మన్నించి మమ్ము గావుము నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా దాత క్రీస్తు నాథ రక్షకా ||వందనం|| దేవ మాదు కాలుసేతు లెల్లను సేవకాలి తనువు దినములన్నియు నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ సేవకై యంగీకరించుమా ||వందనం|| కోతకొరకు దాసజనము నంపుము ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము ఖ్యాతి నొందు నీతి సూర్యుడా ||వందనం|| మా సభలను పెద్దజేసి పెంచుము నీ సువార్త జెప్ప శక్తి నీయుము మోసపుచ్చు నందకార మంత ద్రోయుము యేసు కృపన్ గుమ్మరించుము ||వందనం||
vandanambonartumo prabho prabho vandanambonartumo prabho prabho vandanambu tandri tanaya sud'dhatmuda vandanambu landuko prabho ||vandanam|| inni nallu dharanu mam'mu brochiyu ganna tandri minchi epudu gachiyu ennaleni divena lidu nanna yesuva yanni retlu stotramulivigo ||vandanam|| prata vatsarampu bapa mantayu britini manninchi mam'mu gavumu nuta nabdamunanu nidu niti nosaguma data kristu natha raksaka ||vandanam|| deva madu kalusetu lellanu sevakali tanuvu dinamulanniyu ni vosangu vendi pasidi jnanamanta ni sevakai yangikarinchuma ||vandanam|| kotakoraku dasajanamu nampumu i tari ma lotupatlu dirchumu patakambu lella mapi bhiti bapumu khyati nondu niti suryuda ||vandanam|| ma sabhalanu peddajesi penchumu ni suvarta jeppa sakti niyumu mosapuchchu nandakara manta droyumu yesu krpan gum'marinchumu ||vandanam||