నూతన గీతము నే పాడెదా
Nutana Gitamu Ne Padeda
నూతన గీతము నే పాడెదా – మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను – ఏస్థితిలోనైననూ సమర్పణతో సేవించెదను నిన్నే – సజీవుడనై ఆరాధించెద నిన్నే కొలువుచేసి ప్రేమించినావు – కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా – నీకు సాటెవ్వరూ నీవే నా ప్రాణము – నిను వీడి నేనుండలేను || నూతన || కడలి తీరం కనబడనివేళ – కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా – నీకు సాటెవ్వరూ నీవేనా ధైర్యమూ – నీ కృపయే ఆధారమూ || నూతన || మేఘములలో నీటిని దాచి – సంద్రములలో మార్గము చూపి మంటిఘటములో మహిమాత్మ నింపిన – నీకు సాటెవ్వరూ నీవేనా విజయమూ – నీ మహిమయే నా గమ్యమూ || నూతన ||
nutana gitamu ne padeda - manoharuda yesayya nivu chupina premanu ne maruvanu - esthitilonainanu samarpanato sevinchedanu ninne - sajivudanai aradhincheda ninne koluvuchesi preminchinavu - koradaginadi emundinalo svardha merugani satvikuda - niku satevvaru nive na pranamu - ninu vidi nenundalenu || nutana || kadali tiram kanabadanivela - kadali keratalu vedhinchuvela karunamurtiga digivachchina - niku satevvaru nivena dhairyamu - ni krpaye adharamu || nutana || meghamulalo nitini dachi - sandramulalo margamu chupi mantighatamulo mahimatma nimpina - niku satevvaru nivena vijayamu - ni mahimaye na gamyamu || nutana ||