జీవప్రధాతవు నను

Jivapradhatavu Nanu

30 Nov 2025

జీవప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు జగములనేలే మహిమాన్వితుడా నా యెడ నీ కృపను జాలీ హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడెధాను ఏమని పొగడెధను శుభకరమైన తొలిప్రేమను నే - మరువక జీవింప కృప నీయవా కోవెలలో నీ కానుక నేనై - కోరికలో నీ వేడుక నీవై జత కలసి నిలిచి జీవింపదలచి - కార్చితివి నీ రుధిరమే నీ తాగఫలితం నీ ప్రేమమధురం - నాసొంతమే యేసయ్య ||జీవప్రధాతవు|| నేనేమైయున్న నీ కృపా కదా - నాతో నీ సన్నిధి పంపవా ప్రతికులతలు శృతిమించినాను - సంధ్యాకాంతులు నిదురించినాను తొలివెలుగు నీవై ఉదయించినాపై - నడిపించినది నీవయ్యా నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి - బలపరచినా యేసయ్య ||జీవప్రధాతవు|| మహిమను ధరించినయోధులతో కలసి - దిగివచ్చేదవు నాకోసమే వేల్పులలోన బహుఘనుడవు నీవు - విజయవిహారుల ఆరాధ్యుడవు విజయోత్సవముతో ఆరాధించెను - అభిషక్తుడవు నీవని ఏనాడు పొందని ఆత్మాభిషేకముతో - నింపుము నా యేసయ్య ||జీవప్రధాతవు||


jivapradhatavu nanu rupinchina silpivi nive prabhu jivana yatralo andaga niliche tandrivi nive prabhu jagamulanele mahimanvituda na yeda ni krpanu jali hrdayuda napai chupina vidani ni premanu emani padedhanu emani pogadedhanu subhakaramaina tolipremanu ne - maruvaka jivimpa krpa niyava kovelalo ni kanuka nenai - korikalo ni veduka nivai jata kalasi nilichi jivimpadalachi - karchitivi ni rudhirame ni tagaphalitam ni premamadhuram - nasontame yesayya ||jivapradhatavu|| nenemaiyunna ni krpa kada - nato ni sannidhi pampava pratikulatalu srtiminchinanu - sandhyakantulu nidurinchinanu tolivelugu nivai udayinchinapai - nadipinchinadi nivayya ni krpaku nannu patruniga chesi - balaparachina yesayya ||jivapradhatavu|| mahimanu dharinchinayodhulato kalasi - digivachchedavu nakosame velpulalona bahughanudavu nivu - vijayaviharula aradhyudavu vijayotsavamuto aradhinchenu - abhisaktudavu nivani enadu pondani atmabhisekamuto - nimpumu na yesayya ||jivapradhatavu||