దేవుని వారసులం

Devuni Varasulam

A. B. Masilamani Garu 06 Dec 2025

దేవుని వారసులం – ప్రేమ నివాసులము జీవన యాత్రికులం – యేసుని దాసులము నవ యుగ సైనికులం – పరలోక పౌరులము హల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము ||దేవుని|| సజీవ సిలువ ప్రభు – సమాధి గెలుచుటకే విజేత ప్రేమికులం – విధేయ బోధకులం నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదుము || 2 || ||దేవుని|| ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా విభు మహిమను గాంచ – విశ్వమే మేము గోల శుభములు గూర్చుచు మాలోన శోభిల్లు యేసుని చూపుదుము || 2 || ||దేవుని|| దారుణ హింస లలో – దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో – ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము || 2 || ||దేవుని|| పరిశుద్దాత్మునికై – ప్రార్థన సలుపుదము పరమాత్ముని రాక – బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును జూపుటకై సర్వాంగ హోమము జేయుదము || 2 || ||దేవుని|| అనుదిన కూటములు – అందరి గృహములలో ఆనందముతోను – ఆరాధనలాయే వీనుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదము || 2 || ||దేవుని|| హత సాక్షుల కాలం – అవనిలో చెలరేగ గతకాలపు సేవ – గొల్గొతా గిరి జేర భీతులలో బహు రీతులలో నూతన లోకము కాంక్షింతుము || 2 || ||దేవుని||


devuni varasulam - prema nivasulamu jivana yatrikulam - yesuni dasulamu nava yuga sainikulam - paraloka paurulamu halleluya - nava yuga sainikulam - paraloka paurulamu ||devuni|| sajiva siluva prabhu - samadhi geluchutake vijeta premikulam - vidheya bodhakulam nijamuga raksana prabalutakai dhvajamuga siluvanu nilupudumu || 2 || ||devuni|| prabhuvunu chuchutakai prajalandaru raga vibhu mahimanu gancha - visvame memu gola subhamulu gurchuchu malona sobhillu yesuni chupudumu || 2 || ||devuni|| daruna hinsa lalo - devuni dutaluga arani jvalalalo - agani jayamulato marani prema samarpanato sarvatra yesuni kirtintumu || 2 || ||devuni|| parisuddatmunikai - prarthana salupudamu paramatmuni raka - balamu prasadimpa dharanilo prabhuvunu juputakai sarvanga homamu jeyudamu || 2 || ||devuni|| anudina kutamulu - andari grhamulalo anandamutonu - aradhanalaye vinula vindagu patalato dhyanamu cheyuchu muriyudamu || 2 || ||devuni|| hata saksula kalam - avanilo chelarega gatakalapu seva - golgota giri jera bhitulalo bahu ritulalo nutana lokamu kanksintumu || 2 || ||devuni||