సజీవుడవైన యేసయ్యా

Sajivudavaina Yesayya

05 Dec 2025

సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంత సమృద్ధితో || 2 || ఆనందించెద నీలో – అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో || 2 || ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు || 2 || శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి శ్రేష్టమైన నీ వాగ్ధానములతో || 2 || ||సజీవుడవైన|| క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారే క్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో – సంతృప్తి పరతువు నన్ను || 2 || నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే నిత్యమైన నీ సత్య వాక్యముతో || 2 || ||సజీవుడవైన|| నలువది ఏండ్లు – నీ స్వాస్థ్యమును – మోసినది నీవే నీ కృప కాంతిలో – నా చేయి విడువక – నడిపించుచున్నది నీవే || 2 || పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే పరిపూర్ణమైన నీ ఉపదేశమును || 2 || ||సజీవుడవైన||


sajivudavaina yesayya ninnasrayinchina ni variki sahayudavai trpti parachitive samudramanta samrd'dhito || 2 || anandincheda nilo - anudinamu krpa pondi aradhincheda ninne - ananda dhvanulato || 2 || dhana rasule ila - dhanavantulaku - i loka bhagyamu dachina melulenno - dayachesinave - iha paramuna naku || 2 || sramala margamunu niriksana dvaramuga chesitivi srestamaina ni vagdhanamulato || 2 || ||sajivudavaina|| ksemamu nondutaye - sarva janulaku - prayasaga mare ksemadharamu nivai - dirghayuvuto - santrpti paratuvu nannu || 2 || nitya nibandhanaga ni vatsalyamunu chupitive nityamaina ni satya vakyamuto || 2 || ||sajivudavaina|| naluvadi endlu - ni svasthyamunu - mosinadi nive ni krpa kantilo - na cheyi viduvaka - nadipinchuchunnadi nive || 2 || parama rajyamulo mahimato nimputaku anugrahinchitive paripurnamaina ni upadesamunu || 2 || ||sajivudavaina||