ఉతక మీద తలుపు

Utaka Mida Talupu

30 Nov 2025

ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా సోమరి చుట్టూ లేమి తిరుగును సోమరీ మేలుకో… వేకువనే లేచి ప్రార్ధించుకో.. || 2 || జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో || 2 || ||ఉతక|| చిన్న జీవులు చీమలు చూడు వాటికి ఏలిక లేనే లేదు || 2 || అయినను అవి క్రమము గానే నడచును వేసవిలో ఆహారము కూర్చును || 2 || ||సోమరీ|| చిన్న కుందేళ్ళను చూడు ఏ మాత్రము బలము లేని జీవులు || 2 || పేరు సందులలో జీవించును బంధకములు లేనివై తిరుగును || 2 || ||సోమరీ|| చిన్న జీవులు మిడతలు చూడు వాటికి న్యాయాధిపతి లేడుగా || 2 || పంక్తులుగా తీరి సాగి పోవును జ్ఞానము గల వానిగ పేరొందును || 2 || ||సోమరీ|| తెల్లవారుచుండగనే పక్షులు కిలకిలమని దేవుని స్తుతియించును || 2 || బ్రతుకు తెరువు కోసమై తిరుగును ప్రొద్దుగూకు వేళలో గూడు చేరును || 2 || ||సోమరీ|| ఓ మానవుడా నీ మనసును మార్చుకో ఎందుకో నీ పయనము తెలుసుకో || 2 || ప్రభు రాకడ ఎప్పుడో అది తెలియదు అంతమొచ్చుఁ కాలమొక్కటున్నది || 2 || ||సోమరీ||


utaka mida talupu tirugu ritiga tana padaka mida somari tirugadunu ganuga chutteddu tirugu ritiga somari chuttu lemi tirugunu somari meluko... vekuvane lechi prardhinchuko.. || 2 || jnanamuto ni bratukunu marchuko prabhu yesuni ni madilo cherchuko || 2 || ||utaka|| chinna jivulu chimalu chudu vatiki elika lene ledu || 2 || ayinanu avi kramamu gane nadachunu vesavilo aharamu kurchunu || 2 || ||somari|| chinna kundellanu chudu e matramu balamu leni jivulu || 2 || peru sandulalo jivinchunu bandhakamulu lenivai tirugunu || 2 || ||somari|| chinna jivulu midatalu chudu vatiki n'yayadhipati leduga || 2 || panktuluga tiri sagi povunu jnanamu gala vaniga perondunu || 2 || ||somari|| tellavaruchundagane paksulu kilakilamani devuni stutiyinchunu || 2 || bratuku teruvu kosamai tirugunu prodduguku velalo gudu cherunu || 2 || ||somari|| o manavuda ni manasunu marchuko enduko ni payanamu telusuko || 2 || prabhu rakada eppudo adi teliyadu antamochchum kalamokkatunnadi || 2 || ||somari||