ఘనమైన నా యేసయ్యా

Ghanamaina Na Yesayya

Matthews 28 Oct 2025

ఘనమైన నా యేసయ్యా బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు || 2 || (నా) శిరము వంచి స్తుతియింతును నీ – కృపా సత్యములను ప్రకటింతును || 2 || ||ఘనమైన|| నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యము నీ – ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము || 2 || ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా || 2 || తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా || 2 || ఏమని వర్ణించెదను నీ ప్రేమను నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు || 2 || ||ఘనమైన|| మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము నీ – శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి సిలువలో బలియాగము || 2 || మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నావయ్యా || 2 || మానవ జాతికి రక్షణ మార్గము చూపించుచున్నావయ్యా || 2 || ఏమని వర్ణించెదను నీ ప్రేమను నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు || 2 || ||ఘనమైన|| సంఘ క్షేమముకై సంచకరువుగా పరిశుద్ధాత్ముని ఆగమనము అద్భుతమైన కార్యములే నీవు ఇచ్చిన కృపా వరములు || 2 || పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా || 2 || స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా || 2 || ఏమని వర్ణించెదను నీ ప్రేమను నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు || 2 || ||ఘనమైన||


ghanamaina na yesayya bahu ascharyamulu ni ghana karyamulu || 2 || (na) siramu vanchi stutiyintunu ni - krpa satyamulanu prakatintunu || 2 || ||ghanamaina|| ni cheti panule kanipinche ni srsti saundaryamu ni - unnatamaina uddesame manti nundi naruni nirmanamu || 2 || okani nundi prati vansamunu srstinchinavayya || 2 || tarataramuluga manusyulanu posinchuchunnavayya || 2 || emani varninchedanu ni premanu nenennani prakatinchedanu ni karyamulu || 2 || ||ghanamaina|| mahonnatamaina sankalpame paramunu vidina ni tyagamu ni - sasvata prema samarpanaye kaluvari siluvalo baliyagamu || 2 || margamu satyamu jivamu nivai nadipinchuchunnavayya || 2 || manava jatiki raksana margamu chupinchuchunnavayya || 2 || emani varninchedanu ni premanu nenennani prakatinchedanu ni karyamulu || 2 || ||ghanamaina|| sangha ksemamukai sanchakaruvuga parisud'dhatmuni agamanamu adbhutamaina karyamule nivu ichchina krpa varamulu || 2 || paripurnatakai parisud'dhulaku upadesa kramamunu ichchavayya || 2 || svasthyamaina janulaku mahima nagaram nirminchuchunnavayya || 2 || emani varninchedanu ni premanu nenennani prakatinchedanu ni karyamulu || 2 || ||ghanamaina||