యెహోవా మా తండ్రి గాడ
Yehova Ma Tandri Gada
యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్న గాడ మహిమా గల శుద్ధాత్మ యిట్టి - వరుస దెలిపెం గద మాతోడ || యెహోవా || మోక్ష నగరు మా పుట్టిల్లు - ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమై యున్నపుడు - లక్షపెట్టి మిహ బాధలకు || యెహోవా || అబ్రహాము దావీదు మొదలై - నట్టి వర భక్తా గ్రేసరులే శుబ్రముగ మా చుట్టా లైనన్ - హర్షమిక మా కేమి కొదువ || యెహోవా || పేతు రాది సకలాపోస్తుల్ - పేర్మిగల మా నిజ కుటస్తుల్ ఖ్యాతి సభలో మే మున్నపుడు - ఘనతలిక మాకేమి వెలితి || యెహోవా || తనువు బలిపెట్టెను మా యన్న- తప్పు ల్విడగొట్టెను మాతండ్రి మనసులో సాక్షమిట్లున్న - మనుజు లెట్లన్నను మాకేమి || యెహోవా || పరమ విభు జీవ గ్రంధములో - బ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా నుండు మా పేరు - చెరుపు బెట్టెడువా రింకెవ్వరు || యెహోవా || కరములతో నంట రాని - కన్నులకు గోచరము గాని పరమ ఫలముల్ మా కున్నపుడు - సరుకు గోన మిక్కిడి లేములకు || యెహోవా ||
yehova ma tandri gada yesudu ma yanna gada mahima gala sud'dhatma yitti - varusa delipem gada matoda || yehova || moksa nagaru ma puttillu - mukhya dutal ma snehitulu saksatkaramai yunnapudu - laksapetti miha badhalaku || yehova || abrahamu davidu modalai - natti vara bhakta gresarule subramuga ma chutta lainan - harsamika ma kemi koduva || yehova || petu radi sakalapostul - permigala ma nija kutastul khyati sabhalo me munnapudu - ghanatalika makemi veliti || yehova || tanuvu balipettenu ma yanna- tappu lvidagottenu matandri manasulo saksamitlunna - manuju letlannanu makemi || yehova || parama vibhu jiva grandhamulo - brabhuni raktaksaramudritame chiramuga nundu ma peru - cherupu betteduva rinkevvaru || yehova || karamulato nanta rani - kannulaku gocharamu gani parama phalamul ma kunnapudu - saruku gona mikkidi lemulaku || yehova ||