కల్ల ఎరుగని తెల్ల
Kalla Erugani Tella
కల్ల ఎరుగని తెల్ల పావురమా పైపైకెగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా || 2 || అయ్యో… పావురమా… ఓ ఓ ఓ ఓ… పావురమా… || కల్ల ఎరుగని || రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా రాకాసి మూకల స్నేహాలే నీకు గూడులుగా మారేనా || 2 || ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ || 2 || గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా || 2 || || కల్ల ఎరుగని|| నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేనని రాతాలు చదివవా || 2 || ప్రేమంటేనే తెలియని మనుషులు గారడీ చెల్లెమ్మ ప్రేమ పేరుతో మోసపోతే అది అరాడి బ్రతుకమ్మ || 2 || నీతి మాలినమనుషుల ప్రేమనునిజమనుకొక్కమ్మ ఎండ మావిలో ఎన్నడూ దాహం తీరదు చెల్లెమ్మ || 2 || || కల్ల ఎరుగని|| నీకొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా || 2 || అందరు నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే || 2 || రక్తము పోసి ప్రేమలేఖ నీకు వ్రాసిన నీ ప్రియుడే రక్షణనిచ్చి రాణిగ చేసే యేసు రాజు ఘనుడే || 2 || || కల్ల ఎరుగని||
kalla erugani tella pavurama paipaikegirava kathinamaina i lokapu pokada kanaka unnava || 2 || ayyo... pavurama... o o o o... pavurama... || kalla erugani || rangu rangula akarsanale vittanalayyena rakasi mukala snehale niku guduluga marena || 2 || akali tirchaga challina nukalu kave chellem'ma asato nivu velli valite urule cheralam'ma || 2 || gundello guchchi mantallo kalche maye premam'ma yavvana kalapu kamapu chestalu premanukokam'ma || 2 || || kalla erugani|| ninnu chudaka undalenani matalu vinnava nivu lekapote bratukalenani ratalu chadivava || 2 || premantene teliyani manusulu garadi chellem'ma prema peruto mosapote adi aradi bratukam'ma || 2 || niti malinamanusula premanunijamanukokkam'ma enda mavilo ennadu daham tiradu chellem'ma || 2 || || kalla erugani|| nikorake tana pranamu pettina premanu chudam'ma ninnu chudaka undaleni a preme nijamam'ma || 2 || andaru ninnu marachina gani maruvani snehitude kondarilaga madhyalo ninnu viduvani premikude || 2 || raktamu posi premalekha niku vrasina ni priyude raksananichchi raniga chese yesu raju ghanude || 2 || || kalla erugani||