దేవునికి స్తోత్రము గానముచేయుటయే
Devuniki Stotramu Ganamuceyutaye
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి|| గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి|| నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి|| ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి|| దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి|| ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి|| పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి|| గుర్రముల నరులందలి బలము నానందించడు కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి|| యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి|| పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్ మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి|| భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి|| వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి||
devuniki stotramu ganamu cheyutaye manchidi manamandaramu stutiganamu cheyutaye manchidi yerusalemu yehovaye kattuchunnavadani israyeliyulanu pogucheyuvadani ||devuniki|| gunde chedarina varini bagucheyuvadani vari gayamulanniyu kattuchunnavadani ||devuniki|| naksatramula sankhyanu ayane niyaminchunu vatikanniyu perulu pettuchunnavadani ||devuniki|| prabhuvu goppavadunu adhika sakti sampannudu jnanamunaku ayane mitiyu lenivadani ||devuniki|| dinulaku andayene bhaktihinula kulchunu sitarato devuni stutulato kirtinchudi ||devuniki|| ayana akasamun meghamulato kappunu bhumikoraku varsamu sid'dhaparachuvadani ||devuniki|| parvatamulalo gaddini pasuvulaku molapinchenu arachu pillakakulakunu aharamu taniyunu ||devuniki|| gurramula narulandali balamu nanandinchadu krpa vedu varilo santasinchuvadani ||devuniki|| yerusalemu yehovanu siyonu ni devuni kirtinchumu koniyadumu anandinchuvadani ||devuniki|| pillala nasirvadinchiyu balaparachu ni gum'mamul manchi godhumapantato ninnu trptiganunchunu ||devuniki|| bhumiki tanayajnanu ichchuvadu ayane vegamuganu devuni vakyamu parugettunu ||devuniki|| vakyamunu yakobuku teliyachesinavadani e janamukilaguna chesiyundaledani ||devuniki||