మనసున్న మంచి దేవా

Manasunna Manci Deva

07 Dec 2025

మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలిన మైన నాకై మనిషిగా దిగివచ్చావ || 2 || నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిలో రారాజుగా నిలిచిపోవయా || 2 || హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము || 2 || మనసు మర్మమెరిగినా మహనీయుడా మనసు మార్చ గలిగినా నిజ దేవుడా || 2 || చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను || 2 || అంతరంగమును పరిశీలించు యేసయ్యా స్థిరమనస్సుతో నీదారిలో సాగనీవయ్యా నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి దీన మనసు తో నీ కడ శిరము వంచితి || 2 || పూర్ణ శాంతి గల వానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా


manasunna manchi deva ni manasunu nakichchava manasu malina maina nakai manisiga digivachchava || 2 || na madini kovelaga maluchukovaya na hrdilo rarajuga nilichipovaya || 2 || hrdayamu vyadhito nindina kapata kendramu danini grahiyinchuta evari sadhyamu || 2 || manasu marmamerigina mahaniyuda manasu marcha galigina nija devuda || 2 || chanchala manasadinchu bratuku atanu vanchana chesi nadupunu tappu batanu || 2 || antarangamunu parisilinchu yesayya sthiramanas'suto nidarilo saganivayya nindu manas'suto ninnu asrayinchiti dina manasu to ni kada siramu vanchiti || 2 || purna santi gala vaniga nannu marchuma tarataramulaku ksemamu chekurchuma