ఆధారం నాకు ఆధారం

Adharam Naku Adharam

Bonigala Babu Rao 28 Oct 2025

ఆధారం నాకు ఆధారం నాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారం ఆశ్రయమూ నాకు ఆశ్రయమూ ఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూ తల్లితండ్రి లేకున్నా – బంధుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా – బాధలన్ని బంధువులైనా ||ఆధారం|| భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడియుండగా || 2 || ఇరుకులో విశాలతనూ కలిగించిన దేవా || 2 || నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా || 2 || ||ఆధారం|| దారిద్య్రపు సుడినుండి ఐశ్యర్యపు తీరానికి నీ స్వరమె నా వరమై నడిపించిన యేసయ్యా || 2 || విడువను ఎడబాయనని పలికిన నా దేవా || 2 || నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా || 2 || ||ఆధారం|| దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా || 2 || చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా || 2 || నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా || 2 || ||ఆధారం||


adharam naku adharam naku todunidai unna ni krpaye adharam asrayamu naku asrayamu apatkalamandu asrayamu ni namam asrayamu tallitandri lekunna - bandhujanulu rakunna lokamanta okataina - badhalanni bandhuvulaina ||adharam|| bhaktihina bandhanlo nenundaga sramala sandranlo padiyundaga || 2 || irukulo visalatanu kaliginchina deva || 2 || ni challani odilo nannu cherchaga rava || 2 || ||adharam|| daridyrapu sudinundi aisyaryapu tiraniki ni svarame na varamai nadipinchina yesayya || 2 || viduvanu edabayanani palikina na deva || 2 || ni challani odilo nannu cherchaga rava || 2 || ||adharam|| digulupadina velalalo daricherina deva avamanapu chikatilo balamichchina na deva || 2 || chikatilo veluguvai nadichochchina na deva || 2 || ni challani odilo nannu cherchaga rava || 2 || ||adharam||