కుమ్మరి చేతిలో మంటి వలె
Kummari Cetilo Manti Vale
కుమ్మరి చేతిలో మంటి వలె తల్లి ఒడిలో పసి బిడ్డ వలె || 2 || అయ్యా నీ కృపతో నన్ను మార్చుము యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము ||కుమ్మరి|| నాలోని స్వయమును నలుగ గొట్టుము నాలోని వంకరలు సక్కగా చేయుము || 2 || నీ పోలిక వచ్చే వరకు నా చేయి విడువకు || 2 || సారె పైనుండి తీసివేయకు || 2 || ||కుమ్మరి|| నాలోని అహమును పారద్రోలుము నాలోని తొందరలు తీసి వేయుము || 2 || నీ భుజముపై ఆనుకొనే బిడ్డగా మార్చుము || 2 || నీ చేతితో నడిపించుము || 2 || ||కుమ్మరి||
kum'mari chetilo manti vale talli odilo pasi bidda vale || 2 || ayya ni krpato nannu marchumu yesayya ni polikaga nannu diddumu ||kum'mari|| naloni svayamunu naluga gottumu naloni vankaralu sakkaga cheyumu || 2 || ni polika vachche varaku na cheyi viduvaku || 2 || sare painundi tisiveyaku || 2 || ||kum'mari|| naloni ahamunu paradrolumu naloni tondaralu tisi veyumu || 2 || ni bhujamupai anukone biddaga marchumu || 2 || ni chetito nadipinchumu || 2 || ||kum'mari||