మారుతుంది నీ జీవితము

Marutundi Ni Jivitamu

Bro. Shalem Raju Garu 08 Dec 2025

మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా మరచిపోడు నిను యేసయ్య మాటే నమ్ము సుమా || 2 || మోసే భారం నువు చేసే త్యాగం || 2 || ఎదురీతలన్ని యెద కోతలన్ని చూసేను నా దైవం చేయ్యునులే సాయం || 2 || ఆలస్యం అయిందని ఆక్రందన చెందకు రోజులు మారవని రోధించకు || 2 || ఆ రోధననే ఆరాధనగా మనుగడనే మాధుర్యముగా మలచును నా దైవం విడువకు నీ ధైర్యం || 2 || || మారుతుంది || నీ కథ మారిందని నిరాశలో ఉండకు నీ వ్యధ తీరదని చింతించకు || 2 || నీ చింతలనే చిరు నవ్వులుగా యాతననే స్తుతి కీర్తనగా మార్చును నా దైవం వీడకు విశ్వాసం || 2 || || మారుతుంది ||


marutundi ni jivitamu vedana chendakuma marachipodu ninu yesayya mate nam'mu suma || 2 || mose bharam nuvu chese tyagam || 2 || eduritalanni yeda kotalanni chusenu na daivam cheyyunule sayam || 2 || alasyam ayindani akrandana chendaku rojulu maravani rodhinchaku || 2 || a rodhanane aradhanaga manugadane madhuryamuga malachunu na daivam viduvaku ni dhairyam || 2 || || marutundi || ni katha marindani nirasalo undaku ni vyadha tiradani chintinchaku || 2 || ni chintalane chiru navvuluga yatanane stuti kirtanaga marchunu na daivam vidaku visvasam || 2 || || marutundi ||