ఎంతో వింత యెంతో చింత

Ento Vinta Yento Cinta

28 Oct 2025

ఎంతో వింత యెంతో చింత యేసునాధు మరణ మంత || 2 || పంతము తో జేసి రంత సొంత ప్రజలు స్వామి నంత || 2 || ||ఎంతో|| పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు నాధు నకటా || 2 || అట్టి శ్రమల నొంది పలుక డాయె యేసు స్వామి నాడు || 2 || ||ఎంతో|| మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపు పైని || 2 || మొయ్యలేక మ్రాని తోడ మూర్చబోయే నేసు తండ్రి || 2 || ||ఎంతో|| కొయ్యపై నేసయ్యన్ బెట్టి కాలు సేతులలో జీలల్ || 2 || కఠిను లంత గూడి కొట్టిరి ఘోరముగ క్రీస్తేసున్ బట్టి || 2 || ||ఎంతో|| దాహము గొన చేదు చిరక ద్రావ నిడిరి ద్రోహు లకటా || 2 || ధాత్రి ప్రజల బాధ కోర్చి ధన్యుడా దివి కేగె నహహా || 2 || ||ఎంతో|| బల్లెముతో బ్రక్కన్ బొడవన్ పారే నీరు రక్త మహహా || 2 || ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కెలమి నొసగు || 2 || ||ఎంతో||


ento vinta yento chinta yesunadhu marana manta || 2 || pantamu to jesi ranta sonta prajalu svami nanta || 2 || ||ento|| patti katti netti kotti titti resu nadhu nakata || 2 || atti sramala nondi paluka daye yesu svami nadu || 2 || ||ento|| moyyaleni mranu nokati mopi resu vipu paini || 2 || moyyaleka mrani toda murchaboye nesu tandri || 2 || ||ento|| koyyapai nesayyan betti kalu setulalo jilal || 2 || kathinu lanta gudi kottiri ghoramuga kristesun batti || 2 || ||ento|| dahamu gona chedu chiraka drava nidiri drohu lakata || 2 || dhatri prajala badha korchi dhan'yuda divi kege nahaha || 2 || ||ento|| ballemuto brakkan bodavan pare niru rakta mahaha || 2 || erai pare yesu rakta mella prajala kelami nosagu || 2 || ||ento||