యెహోవా మా తండ్రి
Yehova Ma Tandri
యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు మా యన్న గాఁడ మహిమ గల శుద్ధాత్మ యిట్టి వరుసఁ దెలిపెం గద మాతోడ ||యెహోవా|| మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమై యున్నపుడు లక్ష్యపెట్ట మిహ బాధలకు ||యెహోవా|| అబ్రాహాము దావీదు మొదలై నట్టి వర భక్తాగ్రేసరులే శుభ్రముగ మా చుట్టా లైనన్ హర్షమిఁక మా కేమి కొదువ ||యెహోవా|| పేతు రాది సకలాపోస్తుల్ పేర్మిగల మా నిజ వర కూటస్థుల్ ఖ్యాతి సభలో మే మున్నప్పుడు ఘనతలిక మాకేమి వెలితి ||యెహోవా|| తనువు బలిపెట్టెను మా యన్న తప్పు ల్విడఁ గొట్టెను మా తండ్రి మనసులో సాక్ష్యమిట్లున్న మనుజు లెట్లన్నను మా కేమి ||యెహోవా|| పరమ విభు జీవగ్రంథములోఁ బ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా నుండు మా పేరు చెఱుపు బెట్టెడువా రింకెవరు ||యెహోవా|| కరములతో నంట రాని కన్నులకు గోచరము గాని పరమ ఫలముల్ మా కున్నపుడు సరకు గొన మిక్కడి లేములకు ||యెహోవా||
yehova ma tandri gamda yesumdu ma yanna gamda mahima gala sud'dhatma yitti varusam delipem gada matoda ||yehova|| moksa nagaru ma puttillu mukhya dutal ma snehitulu saksatkaramai yunnapudu laksyapetta miha badhalaku ||yehova|| abrahamu davidu modalai natti vara bhaktagresarule subhramuga ma chutta lainan harsamimka ma kemi koduva ||yehova|| petu radi sakalapostul permigala ma nija vara kutasthul khyati sabhalo me munnappudu ghanatalika makemi veliti ||yehova|| tanuvu balipettenu ma yanna tappu lvidam gottenu ma tandri manasulo saksyamitlunna manuju letlannanu ma kemi ||yehova|| parama vibhu jivagranthamulom brabhuni raktaksaramudritame chiramuga nundu ma peru cherupu betteduva rinkevaru ||yehova|| karamulato nanta rani kannulaku gocharamu gani parama phalamul ma kunnapudu saraku gona mikkadi lemulaku ||yehova||