బంగారం అడుగలేదు

Bangaram Adugaledu

06 Dec 2025

బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు హృదయాన్ని అడిగాడయ్యా || 2 || మనుషులను చేసాడయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా || 2 || నా యేసయ్యా.. నా యేసయ్యా… నా యేసయ్యా.. నా యేసయ్యా… ||బంగారం|| పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా || 2 || కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా || 2 || ||నా యేసయ్యా|| రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా ధనవంతులనుగా మనలను చేయ దారిద్ర్యమొందాడయ్యా || 2 || కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా || 2 || ||నా యేసయ్యా||


bangaram adugaledu vajralni adugaledu hrdayanni adigadayya astulanu adugaledu antastulu adugaledu hrdayanni adigadayya || 2 || manusulanu chesadayya i lokanni ichchadayya || 2 || na yesayya.. na yesayya... na yesayya.. na yesayya... ||bangaram|| papanni tolaginchi sapanni viricheya bhulokam vachchadayya manavuni raksinchi paralokamuna chercha siluvanu mosadayya || 2 || kannitini tudichadayya santosam panchadayya || 2 || ||na yesayya|| raksananu andinchi raktanni chindinchi moksanni ichchadayya dhanavantulanuga manalanu cheya daridryamondadayya || 2 || kannitini tudichadayya santosam panchadayya || 2 || ||na yesayya||