దేవునియందు నిరీక్షణ నుంచి

Devuniyandu Niriksana Nunci

19 Nov 2025

దేవునియందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా || 2 || ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు || 2 || ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు || 2 || ||దేవుని|| చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు || 2 || సత్యమగు – జీవమగు – మార్గమేసే || 2 || ||దేవుని|| నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే || 2 || ఆధారము – ఆదరణ – ఆయనలో || 2 || ||దేవుని|| తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను || 2 || తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు || 2 || ||దేవుని|| నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు || 2 || శత్రువులు – మిత్రులుగా – మారుదురు || 2 || ||దేవుని|| పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు || 2 || కనికర – సంపన్నుడు – నా దేవుడు || 2 || ||దేవుని|| స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద || 2 || హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ || 2 || ||దేవుని||


devuniyandu niriksana nunchi ayananu stutinchu na pranama || 2 || e apayamu rakunda ninnu - divaratrulu kapaduvadu || 2 || pratiksanam - ni paksamundu - raksakudu || 2 || ||devuni|| chikatini veluguga chesi - ayana ni mundu povuvadu || 2 || satyamagu - jivamagu - margamese || 2 || ||devuni|| niku sahayamu cheyuvadu - sada adukonu vadu ayane || 2 || adharamu - adarana - ayanalo || 2 || ||devuni|| talli tana biddanu marachinanu - maruvadu ni devudu ninnu || 2 || tallikanna - tandrikanna - uttamudu || 2 || ||devuni|| niku virodhamuga rupinchina - e vidha ayudhamunu vardhilladu || 2 || satruvulu - mitruluga - maruduru || 2 || ||devuni|| parvatamulu tolagi poyinanu - tana krpa ninnu ennadu vidadu || 2 || kanikara - sampannudu - na devudu || 2 || ||devuni|| stuti mahimalu nike prabhu - nityamu ninne koniyadeda || 2 || halleluya - halleluya - halleluya || 2 || ||devuni||