అన్నీ సాధ్యమే యేసుకు
Anni Sadhyame Yesuku
అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే || 2 || అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా || 2 || ఆ యేసు రక్తానికి సాధ్యమే సాధ్యమే సాధ్యమే || 2 || ||అన్నీ సాధ్యమే|| మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను || 2 || మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను || 2 || ||అన్నీ సాధ్యమే|| బండనే చీల్చగా – జలములే పొంగెను ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను || 2 || బందంటే క్రీస్తేనని – నీ దండమే తానని మెండైన తన కృపలో – నీకండగా నిలచును || 2 || ||అన్నీ సాధ్యమే|| ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయము ఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము || 2 || యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించును ఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును || 2 || ||అన్నీ సాధ్యమే|| కష్టాల కడలిలో – కన్నీటి లోయలో కనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును || 2 || కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యము క్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము || 2 || ||అన్నీ సాధ్యమే||
anni sadhyame yesuku anni sadhyame || 2 || adbhuta saktini neraputakaina ascharya karyamulosagutakaina || 2 || a yesu raktaniki sadhyame sadhyame sadhyame || 2 || ||anni sadhyame|| madhuryamaina jalamuga - maranu prabhu marchenu mrtyuvu nundi lajarunu - mahimarthamukai lepenu || 2 || mannanu kuripinchaga - akasame terichenu marananni odinchaga - mrtyunjayudai lechenu || 2 || ||anni sadhyame|| bandane chilchaga - jalamule pongenu endipoyina bhumipai - erulai avi parenu || 2 || bandante kristenani - ni dandame tanani mendaina tana krpalo - nikandaga nilachunu || 2 || ||anni sadhyame|| ekantamuga mokarilli - prardhinchute sreyamu ela naki sramalani - purna manasuto vedumu || 2 || yesayya ni vedana - alinchi manninchunu e pati vyadhalainanu - a silvalo tirchunu || 2 || ||anni sadhyame|| kastala kadalilo - kanniti loyalo kanikarame prabhu chupunu - kantipapala kayunu || 2 || kaliginchu visvasamu - kadedi asadhyamu kristesu namamulo - kadagandlake moksamu || 2 || ||anni sadhyame||