కన్నీరేలమ్మా… కరుణించు యేసు

Kannirelamma Karunincu Yesu

Samuel Karmoji 28 Oct 2025

కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలత మాన్పె || 2 || యేసే తోడమ్మా ||కన్నీరేలమ్మా|| నీకేమీ లేదని ఏమీ తేలేదని అన్నారా నిన్ను అవమాన పరిచారా తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా చింతించకన్న యేసు మాటలు మరిచావా మారాను మధురంగా మార్చెను చూసావా || 2 || ||కన్నీరేలమ్మా|| నీకెవరూ లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా || 2 || ||కన్నీరేలమ్మా||


kannirelam'ma... karuninchu yesu ninnu viduvabodam'ma kalavarapadakam'ma... karuninchu yesu ninnu viduvabodam'ma karuna chupi kalata manpe || 2 || yese todam'ma ||kannirelam'ma|| nikemi ledani emi teledani annara ninnu avamana parichara tala rata intenani tarvata emaunonani repatini gurchi chintinchuchunnava chintinchakanna yesu matalu marichava maranu madhuranga marchenu chusava || 2 || ||kannirelam'ma|| nikevaru lerani em cheyalevani annara ninnu nirasaparachara porugantivadanani eppatiki intenani na bratuku maradani anukuntu unnava nenunnananna yesu matalu marichava kanniru natyanga marchunu chustava || 2 || ||kannirelam'ma||