అమ్మల్లారా ఓ అక్కల్లారా

Ammallara O Akkallara

Sailanna 28 Oct 2025

అమ్మల్లారా ఓ అక్కల్లారా || 2 || ఈ వార్త వినరండే యేసయ్యను నమ్ముకొండే || 2 || మానవ జాతి పాపము కొరకై || 2 || కన్నీరు విడుస్తుండు ప్రభు రమ్మని పిలుస్తుండు || 2 || ||అమ్మల్లారా|| లోకమంతటా యేసు రక్తము || 2 || ఎరువుగ జల్లిండే మరణపు ముల్లును విరిచిండే || 2 || అమ్మల్లారా ఓ అక్కల్లారా || 2 || ఓ పల్లె చెల్లెల్లారా ఓ పట్నం అక్కల్లారా || 2 || బట్టలు మార్చితే బ్రతుకు మారదు గుండు కొడితే నీ గుణం మారదు బతుకు మారడం బట్టల్ల లేదు గుణం మారడం గుండుల లేదు నీ మనసు మారాలన్నా నీ బుద్ది మారాలన్నా నీ మనసు మారాలక్కా నీ బుద్ది మారాలక్కా ||అమ్మల్లారా|| పాపం లేని యేసు దేవుణ్ణి నమ్ముకుందామమ్మా దేవుడు మంచి దేవుడమ్మా || 2 || అమ్మల్లారా ఓ అక్కల్లారా || 2 || ఈ సత్యమినరండే ఇది కల్ల కాదు చెల్లె ఇది కల్ల కాదు తమ్మి ఇది కల్ల కాదు తాత ఇది కల్ల కాదు అవ్వ ఇది కల్ల కాదు అన్న ఇది కల్ల కాదు అక్క


am'mallara o akkallara || 2 || i varta vinarande yesayyanu nam'mukonde || 2 || manava jati papamu korakai || 2 || kanniru vidustundu prabhu ram'mani pilustundu || 2 || ||am'mallara|| lokamantata yesu raktamu || 2 || eruvuga jallinde maranapu mullunu virichinde || 2 || am'mallara o akkallara || 2 || o palle chellellara o patnam akkallara || 2 || battalu marchite bratuku maradu gundu kodite ni gunam maradu batuku maradam battalla ledu gunam maradam gundula ledu ni manasu maralanna ni buddi maralanna ni manasu maralakka ni buddi maralakka ||am'mallara|| papam leni yesu devunni nam'mukundamam'ma devudu manchi devudam'ma || 2 || am'mallara o akkallara || 2 || i satyaminarande idi kalla kadu chelle idi kalla kadu tam'mi idi kalla kadu tata idi kalla kadu avva idi kalla kadu anna idi kalla kadu akka