ఎంతో సుందరుడమ్మ తాను

Ento Sundarudamma Tanu

M Prashanth Raju 28 Oct 2025

ఎంతో సుందరుడమ్మ తాను… ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను || 2 || ||ఎంతో|| ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు || 2 || అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు || 2 || ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు – || 2 || ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు || 2 || అవలీలగా నతని గురితింపగలనమ్మా || 2 || ||ఎంతో|| కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు || 2 || మరులు మనసున నింపు మహనీయుడాతండు || 2 || కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు – || 2 || సిరులు కురిపించేను వర దేవ తనయుండు || 2 || విరబూయు పరలోక షారోను విరజాజి || 2 || ||ఎంతో|| పాలతో కడిగిన నయనాలు గలవాడు || 2 || విలువగు రతనాల వలె పొదిగిన కనులు || 2 || పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు – || 2 || కలుషము కడిగిన కమలాల కనుదోయి || 2 || విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు || 2 || ||ఎంతో|| మేలిమి బంగారు స్థలమందు నిలిపిన || 2 || చలువ రాతిని బోలు బలమైన పాదాలు || 2 || మేలిమి బంగారు స్థలమందు నిలిచినా చలువ రాతిని బోలు బలమైన పాదాలు – || 2 || ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. || 2 || బలవంతుడగువాడు బహుప్రియుడాతండు || 2 || ||ఎంతో|| అతడతికాంక్షానీయుండు తనయుండు || 2 || అతడే నా ప్రియుడు అతడే నా హితుడు || 2 || అతడతికాంక్షానీయుండు తనయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు – || 2 || ఆతని నొరతి మధురంబు మధురంబు || 2 || ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస || 2 || ||ఎంతో||


ento sundarudam'ma tanu... ento sundarudam'ma tanu nenento murisipoyinanu || 2 || ||ento|| dhavalavarnudu ratna varnudu na priyudu || 2 || avani padivelandu ati sresthudatandu || 2 || dhavalavarnudu ratna varnudu na priyudu avani padivelandu ati sresthudatandu - || 2 || evaru ayanakilalo samarupa purusundu || 2 || avalilaga natani guritimpagalanam'ma || 2 || ||ento|| kurulu nokkulu kalgi sphuradrupiyagu vibhudu || 2 || marulu manasuna nimpu mahaniyudatandu || 2 || kurulu nokkulu kalgi sphuradrupiyagu vibhudu marulu manasuna nimpu mahaniyudatandu - || 2 || sirulu kuripinchenu vara deva tanayundu || 2 || virabuyu paraloka saronu virajaji || 2 || ||ento|| palato kadigina nayanalu galavadu || 2 || viluvagu ratanala vale podigina kanulu || 2 || palato kadigina nayanalu galavadu viluvagu ratanala vale podigina kanulu - || 2 || kalusamu kadigina kamalala kanudoyi || 2 || viluvaina chuposamge varameri tanayundu || 2 || ||ento|| melimi bangaru sthalamandu nilipina || 2 || chaluva ratini bolu balamaina padalu || 2 || melimi bangaru sthalamandu nilichina chaluva ratini bolu balamaina padalu - || 2 || a lebanonu samarupa vaikhari a.. a.. || 2 || balavantudaguvadu bahupriyudatandu || 2 || ||ento|| atadatikanksaniyundu tanayundu || 2 || atade na priyudu atade na hitudu || 2 || atadatikanksaniyundu tanayundu atade na priyudu atade na hitudu - || 2 || atani norati madhurambu madhurambu || 2 || atani palu varusa mutyala sari varusa || 2 || ||ento||