నన్ను దిద్దుము చిన్న ప్రాయము
Nannu Diddumu Cinna Prayamu
నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను – నిన్ను చేరితి నాయనా ||నన్ను|| దూరమునకు బోయి నీ దరి – జేర నైతిని నాయనా నేను కారు మూర్ఖపు పిల్లనై కా – రడవి దిరిగితి నాయనా ||నన్ను|| మంచి మార్గము లేదు నాలో – మరణ పాత్రుండ నాయనా నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా ||నన్ను|| చాల మారులు తప్పిపోతిని – మేలు గానక నాయనా నా చాల మొరల నాలకించుము – జాలిగల నా నాయనా ||నన్ను|| జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనా నీవు జ్ఞానము గల తండ్రి మంచు – జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను|| కొద్ది నరుడను దిద్ది నను నీ – యొద్ద జేర్చుము నాయనా నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము – మొద్దు నైతిని నాయనా ||నన్ను|| ఎక్కడను నీవంటి మార్గము – నెరుగ నైతిని నాయనా నీ రెక్క చాటున నన్ను జేర్చి – చక్కపరచుము నాయనా ||నన్ను|| శత్రువగు సాతాను నన్ను – మిత్రు జేయను నాయనా యెన్నో సూత్రములు గల్పించెను నా – నేత్రముల కో నాయనా ||నన్ను|| వాసిగా నే బాప లోకపు – వాసుడ నో నాయనా నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా ||నన్ను||
nannu diddumu chinna prayamu - sannutundagu nayana nivu kanna tandri vanuchu nenu - ninnu cheriti nayana ||nannu|| duramunaku boyi ni dari - jera naitini nayana nenu karu murkhapu pillanai ka - radavi dirigiti nayana ||nannu|| manchi margamu ledu nalo - marana patrunda nayana nenu vanchitunda naitini pra-panchamanduna nayana ||nannu|| chala marulu tappipotini - melu ganaka nayana na chala morala nalakinchumu - jaligala na nayana ||nannu|| jnana mantayu baduchesi- kana naitini nayana nivu jnanamu gala tandri manchu - jnapti vachchenu nayana ||nannu|| koddi narudanu diddi nanu ni - yodda jerchumu nayana ni yodda jerchi bud'dhi cheppumu - moddu naitini nayana ||nannu|| ekkadanu nivanti margamu - neruga naitini nayana ni rekka chatuna nannu jerchi - chakkaparachumu nayana ||nannu|| satruvagu satanu nannu - mitru jeyanu nayana yenno sutramulu galpinchenu na - netramula ko nayana ||nannu|| vasiga ne bapa lokapu - vasuda no nayana ni dasulalo nokaniga nanu jesi kavumu nayana ||nannu||