నా నీతి నీవే నా ఖ్యాతి నీవే
Na Niti Nive Na Khyati Nive
నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా నా క్రియలు కాదు నీ కృపయే దేవా నా ప్రాణమా యేసయ్యా నదులంత తైలం విస్తార బలులు నీకిచ్చినా చాలవయ్యా నీ జీవితాన్నే నాకిచ్చినావు నీకే నా జీవమయ్యా హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (4) ||నా నీతి|| నా దీన స్థితిని గమనించి నీవు దాసునిగ వచ్చావుగా నా దోష శిక్ష భరియించి నీవు నను నీలో దాచావుగా ఏమంత ప్రేమ నా మీద నీకు నీ ప్రాణమిచ్చావుగా నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను యజమానుడవు నీవేగా ||హల్లెలూయ|| నా ప్రియులే నన్ను వెలివేసినప్పుడు నీవు చేరదీసావుగా నా ప్రక్క నిలిచి నను ధైర్యపరచి కన్నీరు తుడిచావుగా నేనున్న నీకు భయమేలనంటూ ఓదార్పునిచ్చావుగా చాలయ్య దేవ నీ కృపయే నాకు బ్రతుకంతయు పండుగా ||హల్లెలూయ|| ఆ ఊభిలోనా నే చిక్కినప్పుడు నీవు నన్ను చూసావుగా నీ చేయి చాపి నను పైకి లేపి నీ వాక్కునిచ్చావుగా నా సంకటములు నా ఋణపు గిరులు అన్నిటిని తీర్చావుగా నీలోన నాకు నవ జీవమిచ్చి నీ సాక్షిగా నిలిపావుగా ||హల్లెలూయ||
na niti nive na khyati nive na daivama yesayya na kriyalu kadu ni krpaye deva na pranama yesayya nadulanta tailam vistara balulu nikichchina chalavayya ni jivitanne nakichchinavu nike na jivamayya halleluya amen halleluya (4) ||na niti|| na dina sthitini gamaninchi nivu dasuniga vachchavuga na dosa siksa bhariyinchi nivu nanu nilo dachavuga emanta prema na mida niku ni pranamichchavuga ni raktamichchi konnavu nannu yajamanudavu nivega ||halleluya|| na priyule nannu velivesinappudu nivu cheradisavuga na prakka nilichi nanu dhairyaparachi kanniru tudichavuga nenunna niku bhayamelanantu odarpunichchavuga chalayya deva ni krpaye naku bratukantayu panduga ||halleluya|| a ubhilona ne chikkinappudu nivu nannu chusavuga ni cheyi chapi nanu paiki lepi ni vakkunichchavuga na sankatamulu na rnapu girulu annitini tirchavuga nilona naku nava jivamichchi ni saksiga nilipavuga ||halleluya||