నిరంతరం నీతోనే జీవించాలనే

Nirantaram Nitone Jivincalane

Hosanna Ministries 28 Oct 2025

నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది || 2 || నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా ||నిరంతరం|| చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను || 2 || నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని || 2 || పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై ||నిరంతరం|| నీ రూపము నేను కోల్పయినా నీ రక్తముతో కడిగితివి || 2 || నీతోనే నేను నడవాలని నీ వలెనే నేను మారాలని || 2 || పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై ||నిరంతరం|| తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోని నాటితివి || 2 || నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని || 2 || పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||


nirantaram nitone jivinchalane asa nannila bratikinchuchunnadi || 2 || na pranesvara yesayya na sarvasvama yesayya ||nirantaram|| chikatilo nenunnappudu ni velugu napai udayinchenu || 2 || nilone nenu velagalani ni mahima nalo nilavalani || 2 || parisud'dhatma abhisekamuto nannu nimpuchunnavu ni rakadakai ||nirantaram|| ni rupamu nenu kolpayina ni raktamuto kadigitivi || 2 || nitone nenu nadavalani ni valene nenu maralani || 2 || parisud'dhatma varamulato alankarinchuchunnavu ni rakadakai ||nirantaram|| tolakari varsapu jallulalo ni polamuloni natitivi || 2 || nilone chigurinchalani nilone puspinchalani || 2 || parisud'dhatma varsamuto sid'dhaparachuchunnavu ni rakadakai ||nirantaram||