ప్రార్ధన యేసుని సందర్శన

Prardhana Yesuni Sandarsana

10 Nov 2025

ప్రార్ధన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ కరములెత్తి ప్రార్ధించగా పరమ తండ్రి కౌగిలించును స్వరమునెత్తి ప్రార్ధించగా మధుర స్వరముతో మాటాడును ||ప్రార్ధన|| తండ్రి అని నే పిలువగా తనయుడా అని తా బల్కును ఆదుకొనును అన్ని వేళలా కన్నీరంతయు తుడిచివేయున్ ||ప్రార్ధన|| మోకరించి ప్రార్ధించగా సమీపముగా వేంచేయును మనవులెల్ల మన్నించును మహిమతో నలంకారించును ||ప్రార్ధన|| కుటుంబముతో ప్రార్ధించగా కొదువ ఏమియు లేకుండును ఐక్యతలో నివసించును శాశ్వత జీవము అచటుండును ||ప్రార్ధన|| సంఘముగను ప్రార్ధించగా కూడిన చోటు కంపించును పరిశుద్ధాత్ముడు దిగివచ్చును ఆత్మ వరములతో నింపును ||ప్రార్ధన|| ఉపవాసముతో ప్రార్ధించగా కీడులన్నియు తొలగిపోవును కొట్లు ధాన్యముతో నింపును క్రొత్త పానము త్రాగించును ||ప్రార్ధన|| ఏకాంతముగా ప్రార్ధించగా నీతిని నాకు నేర్పించును యేసు రూపము నాకిచ్చును యేసు రాజ్యము నను చేర్చును ||ప్రార్ధన||


prardhana yesuni sandarsana parama tandrito sambhasana karamuletti prardhinchaga parama tandri kaugilinchunu svaramunetti prardhinchaga madhura svaramuto matadunu ||prardhana|| tandri ani ne piluvaga tanayuda ani ta balkunu adukonunu anni velala kannirantayu tudichiveyun ||prardhana|| mokarinchi prardhinchaga samipamuga vencheyunu manavulella manninchunu mahimato nalankarinchunu ||prardhana|| kutumbamuto prardhinchaga koduva emiyu lekundunu aikyatalo nivasinchunu sasvata jivamu achatundunu ||prardhana|| sanghamuganu prardhinchaga kudina chotu kampinchunu parisud'dhatmudu digivachchunu atma varamulato nimpunu ||prardhana|| upavasamuto prardhinchaga kidulanniyu tolagipovunu kotlu dhan'yamuto nimpunu krotta panamu traginchunu ||prardhana|| ekantamuga prardhinchaga nitini naku nerpinchunu yesu rupamu nakichchunu yesu rajyamu nanu cherchunu ||prardhana||