ఆనందమానందమే
Anandamanandame
ఆనందమానందమే ఈ భువిలో యేసయ్య నీ జననము || 2 || సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమ ప్రభావము భూమి మీద తనకిష్టులకు సమాధానము కలుగును గాక హల్లెలూయా ||ఆనంద|| తన ప్రజలను వారి పాపమునుండి రక్షించుట కొరకై యేసు భువికి దిగి వచ్చెను తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించుటకు దేవుని జ్ఞానమై వచ్చెను ||సర్వోన్నత|| మరణ ఛాయలు చీకటిలోను కూర్చున్నవారికి యేసు అరుణోదయమిచ్చెను పాప శాపము నుండి ప్రజలకు విడుదలనిచ్చుటకు క్రీస్తు నర రూపము దాల్చెను ||సర్వోన్నత||
anandamanandame i bhuvilo yesayya ni jananamu || 2 || sarvonnatamaina sthalamulalona devuniki mahima prabhavamu bhumi mida tanakistulaku samadhanamu kalugunu gaka halleluya ||ananda|| tana prajalanu vari papamunundi raksinchuta korakai yesu bhuviki digi vachchenu tana prajalaku raksana jnanamu anugrahinchutaku devuni jnanamai vachchenu ||sarvonnata|| marana chhayalu chikatilonu kurchunnavariki yesu arunodayamichchenu papa sapamu nundi prajalaku vidudalanichchutaku kristu nara rupamu dalchenu ||sarvonnata||