భయము చెందకు భక్తుడా

Bhayamu Cendaku Bhaktuda

11 Nov 2025

భయము చెందకు భక్తుడా ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు || 2 || భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు || 2 || జీవమిచ్చిన యెహొవున్నాడు ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము|| బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా || 2 || పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే || 2 || నాల్గవ వాడు ఉండలేదా ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా ||భయము|| చెరసాలలో వేసినా తన దేహమంతా.. గాయాలతో నిండినా || 2 || పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ || 2 || భూకంపం కలుగ లేదా ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా ||భయము|| ఆస్తి అంతా పోయినా తన దేహమంతా.. కురుపులతో నిండినా || 2 || అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె || 2 || అని యోబు పలుక లేదా ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా ||భయము||


bhayamu chendaku bhaktuda i maya loka chhayalu chuchinappudu || 2 || bhayamu chendaku nivu digulu chendaku nivu || 2 || jivamichchina yehovunnadu o bhaktuda.. pranam pettina yesayyunnadu ||bhayamu|| babulonu desamanduna a bhaktulu mugguru.. bom'maku mrokkananduna || 2 || patti bandhinchi raju agnilo padaveste || 2 || nalgava vadu undaleda o bhaktuda.. nalgava vadu undaleda ||bhayamu|| cherasalalo vesina tana dehamanta.. gayalato nindina || 2 || padi kirtinchi paulu silalu koniyada || 2 || bhukampam kaluga leda a bhaktulu mugguru.. cheranundi vidudala kaleda ||bhayamu|| asti anta poyina tana dehamanta.. kurupulato nindina || 2 || anni ichchina tandri anni tisukupoye || 2 || ani yobu paluka leda o bhaktuda.. ani yobu paluka leda ||bhayamu||