దేవ సంస్తుతి చేయవే మనసా
Deva Sanstuti Ceyave Manasa
దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా – నా యంతరంగము లో వసించు నో సమస్తమా ||దేవ|| జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు || 2 || నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే ||దేవ|| చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను || 2 || జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే ||దేవ|| యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త || 2 || యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే ||దేవ|| ప్రభువు నీతి పనులు చేయును – బాధితులకు న్యాయ మిచ్చున్ || 2 || విభుండు మార్గము తెలిపె మోషేకు – దన కార్యములను విప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే ||దేవ|| అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు || 2 || నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే ||దేవ|| పామరుల మని ప్రత్యుపకార – ప్రతి ఫలంబుల్ పంపలేదు || 2 || భూమి కన్న నాకాసంబున్న – ఎత్తుండు దైవ ప్రేమ భక్తి జనులయందున – ఆ కారణముచే ||దేవ|| పడమటికి తూర్పెంత ఎడమో – పాపములను మనకు నంత || 2 || ఎడము కలుగజేసియున్నాడు – మన పాపములను ఎడముగానే చేసియున్నాడు – ఆ కారణముచే ||దేవ|| కొడుకులపై తండ్రి జాలి – పడు విధముగా భక్తిపరుల || 2 || యెడల జాలి పడును దేవుండు – తన భక్తిపరుల యెడల జాలిపడును దేవుండు – ఆ కారణముచే ||దేవ|| మనము నిర్మితమయిన రీతి – తనకు దెలిసియున్న సంగతి || 2 || మనము మంటి వారమంచును – జ్ఞాపకము చేసి కొనుచు కరుణ జూపుచుండును – ఆ కారణముచే ||దేవ|| పూసి గాలి వీవ నెగిరి – పోయి బసను దెలియని వన || 2 || వాస పుష్పము వలెనె నరుడుండు – నరు నాయువు తృణ ప్రాయము మన దేవ కృప మెండు – ఆ కారణముచే ||దేవ|| పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు || 2 || నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే ||దేవ||
deva sanstuti cheyave manasa sri-mantudagu yehova sanstuti cheyave manasa deva sanstuti cheyuma na - jivama yehova devuni pavana namamu nutinchuma - na yantarangamu lo vasinchu no samastama ||deva|| jivama, yehova niku - jesina mellan maruvaku || 2 || nivu chesina patakambulanu - manninchi jabbu leviyun lekunda jeyunu - a karanamuche ||deva|| chavu gotinundi ninnu - levanetti dayanu grpanu || 2 || jiva kiritamuga veyunu - ni sirasu mida jiva kiritamuga veyunu - a karanamuche ||deva|| yavvanambu paksiraju - yavvanambu valene krotta || 2 || yavvanambai velayunatluga - me lichchi nidu bhavamunu santustiparachunuga - a karanamuche ||deva|| prabhuvu niti panulu cheyunu - badhitulaku n'yaya michchun || 2 || vibhundu margamu telipe moseku - dana karyamulanu vippe nisrayelu janamunaku - a karanamuche ||deva|| atyadhika prema svarupi-yaina dirgha santaparundu || 2 || nityamu vyajyambu cheyadu - a krponnatudu ni payi nepudu kopa munchadu - a karanamuche ||deva|| pamarula mani pratyupakara - prati phalambul pampaledu || 2 || bhumi kanna nakasambunna - ettundu daiva prema bhakti janulayanduna - a karanamuche ||deva|| padamatiki turpenta edamo - papamulanu manaku nanta || 2 || edamu kalugajesiyunnadu - mana papamulanu edamugane chesiyunnadu - a karanamuche ||deva|| kodukulapai tandri jali - padu vidhamuga bhaktiparula || 2 || yedala jali padunu devundu - tana bhaktiparula yedala jalipadunu devundu - a karanamuche ||deva|| manamu nirmitamayina riti - tanaku delisiyunna sangati || 2 || manamu manti varamanchunu - jnapakamu chesi konuchu karuna jupuchundunu - a karanamuche ||deva|| pusi gali viva negiri - poyi basanu deliyani vana || 2 || vasa puspamu valene narudundu - naru nayuvu trna prayamu mana deva krpa mendu - a karanamuche ||deva|| parama deva nibandha najnal - bhaktito gaikonu janulaku || 2 || niratamunu grpa nilichi yundunu - yehova niti taramulu pillalaku nundunu - a karanamuche ||deva||