నీ వాక్యమే నన్ను బ్రతికించెను

Ni Vakyame Nannu Bratikincenu

28 Oct 2025

నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను || 2 || కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా || 2 || ||నీ వాక్యమే|| జిగటగల ఊభినుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను || 2 || నా పాదములకు దీపమాయెను || 2 || సత్యమైన మార్గములో నడుపుచుండెను || 2 || ||నీ వాక్యమే|| శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది || 2 || అపవాది వేయుచున్న అగ్ని బాణములను || 2 || ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది || 2 || ||నీ వాక్యమే|| పాలవంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహా మధురమైనది || 2 || మేలిమి బంగారు కన్న మిన్న అయినది || 2 || రత్న రాసులకన్నా కోరతగినది || 2 || ||నీ వాక్యమే||


ni vakyame nannu bratikinchenu badhalalo nem'madinichchenu || 2 || krpa sakti daya satya sampurnuda vakyamai unna yesu vandanamayya || 2 || ||ni vakyame|| jigatagala ubhinundi levanettenu samatalamagu bhumipai nannu nilipenu || 2 || na padamulaku dipamayenu || 2 || satyamaina margamulo nadupuchundenu || 2 || ||ni vakyame|| satruvulanu edurkone sarvanga kavachamai yud'dhamunaku sid'dha manasu ichchuchunnadi || 2 || apavadi veyuchunna agni banamulanu || 2 || khadgamu vale addukoni arpi veyuchunnadi || 2 || ||ni vakyame|| palavantidi junti tene vantidi na jihvaku maha madhuramainadi || 2 || melimi bangaru kanna minna ayinadi || 2 || ratna rasulakanna korataginadi || 2 || ||ni vakyame||