ఓ నావికా.. ఓ నావికా

O Navika O Navika

Joshua Shaik 28 Oct 2025

ఓ నావికా.. ఓ నావికా.. ఓ నావికా.. యేసు సామి ఊసు వినవా.. ఓ నావికా…. ఓ నావికా…. శ్రమలలో శ్రామికా… || 2 || ఊసు వింటివా వింత గంటివా యేసు సామి ఊసు నీవు వింటివా || 2 || హైలెస్సో హైలెస్సా హైలెస్సో హైలెస్సా || 2 || వలేసావు రాతిరంతా ధార పోసావు కష్టమంతా || 2 || చిక్కలేదు చేప ఒక్కటైనా దక్కలేదు ఫలము కొంతైనా || 2 || అడుగడుగో యేసు వచ్చెనయ్యా వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా || 2 || నింపాడు నీ నావ అద్భుత రీతితో తృప్తిపరిచె నీ బ్రతుకు గొప్ప మేళ్ళతో || 2 || వెంబడించు యేసును పూర్ణ శక్తితో యేసే ఈ జగతికి సర్వాధికారి యేసే నీ నావకి చూపించు దారి || 2 || చేస్తాడు నిన్ను అసలైన జాలరి మనుషుల పట్టే జాలరి || 2 || ||ఓ నావికా|| విరిగి నలిగిన మనస్సుతో చేసావు నీ సమరం || 2 || శయనించక ఎడతెగక ఈదావు ఈ భవ సాగరం || 2 || అడుగడుగో యేసు వచ్చెనయ్యా వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా || 2 || కరుణించాడు నిన్ను చల్లని చూపుతో నిర్మలమయ్యె బ్రతుకు యేసుని ప్రేమతో || 2 || వెంబడించు యేసును పూర్ణ శక్తితో యేసే ఈ జగతికి సర్వాధికారి యేసే నీ నావకి చూపించు దారి || 2 || చేస్తాడు నిన్ను అసలైన జాలరి మనుషుల పట్టే జాలరి || 2 || ||ఓ నావికా||


o navika.. o navika.. o navika.. yesu sami usu vinava.. o navika.... o navika.... sramalalo sramika... || 2 || usu vintiva vinta gantiva yesu sami usu nivu vintiva || 2 || hailes'so hailes'sa hailes'so hailes'sa || 2 || valesavu ratiranta dhara posavu kastamanta || 2 || chikkaledu chepa okkataina dakkaledu phalamu kontaina || 2 || adugadugo yesu vachchenayya varalenno nikai techchenayya || 2 || nimpadu ni nava adbhuta ritito trptipariche ni bratuku goppa mellato || 2 || vembadinchu yesunu purna saktito yese i jagatiki sarvadhikari yese ni navaki chupinchu dari || 2 || chestadu ninnu asalaina jalari manusula patte jalari || 2 || ||o navika|| virigi naligina manas'suto chesavu ni samaram || 2 || sayaninchaka edategaka idavu i bhava sagaram || 2 || adugadugo yesu vachchenayya varalenno nikai techchenayya || 2 || karuninchadu ninnu challani chuputo nirmalamayye bratuku yesuni premato || 2 || vembadinchu yesunu purna saktito yese i jagatiki sarvadhikari yese ni navaki chupinchu dari || 2 || chestadu ninnu asalaina jalari manusula patte jalari || 2 || ||o navika||