ఆధారం నీవేనయ్యా
Adharam Nivenayya
ఆధారం నీవేనయ్యా || 2 || కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా ||ఆధారం|| లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలం || 2 || అయినను ఎందుకో నెమ్మది లేదు || 2 || సమాధానం కొదువైనది యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం|| ఐశ్వర్యం కొదువేమి లేదు కుటుంబములో కలతేమి లేదు || 2 || అయినను ఎందుకో నెమ్మది లేదు || 2 || సమాధానం కొదువైనది యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం|| నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్నకోర్కెలను || 2 || హృదయము నిచ్చావు నెమ్మది నొందా || 2 || సాక్షిగా జీవింతును హల్లేలూయ సాక్షిగా జీవింతును ||ఆధారం||
adharam nivenayya || 2 || kalam marina kastalu tirina karanam nivenayya yesayya karanam nivenayya ||adharam|| lokanlo enno jayalu chusanu neninta kalam || 2 || ayinanu enduko nem'madi ledu || 2 || samadhanam koduvainadi yesayya samadhanam koduvainadi ||adharam|| aisvaryam koduvemi ledu kutumbamulo kalatemi ledu || 2 || ayinanu enduko nem'madi ledu || 2 || samadhanam koduvainadi yesayya samadhanam koduvainadi ||adharam|| ni sevakuniga jivimpa hrdayanlo unnakorkelanu || 2 || hrdayamu nichchavu nem'madi nonda || 2 || saksiga jivintunu halleluya saksiga jivintunu ||adharam||