ఏ పాపమెరుగని
E Papamerugani
ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా ||ఏ పాప|| కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా ||ఏ పాప|| చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా ||ఏ పాప|| ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా ||ఏ పాప|| పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా ||ఏ పాప|| బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము ||ఏ పాప|| కట కటా పాప సం – కటము బాపుట కింత – పటు బాధ నొందినావా ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామి ||ఏ పాప||
e papamerugani yo pavana murti papa vimochakunda na pali daivama na papamula kora ki patlu nondinava mullato kirita - malli ni siramupai - jallatamuna mottira mulla potlaku siramu - talladillaga som'ma - sillipotiva raksaka ||e papa|| kaluvari giri danuka - siluva moyaleka - kalavaramu nondinava siluva nito moya - tuluvalu verokani - toduga nichchinara ||e papa|| chedugu yudulu bettu - padarani patlaku - sudivadi nadachinava kadaku kalvari giri - kada kegi silvanu - grakkuna dinchinava ||e papa|| a kala karmulu - bhikarambuga ninnu - a koyyapai nunchira ni kalu setulu - a koyyake sudi - mekulato gruchchinara ||e papa|| paluvidhambula sramalu - chelarega dandriki - nelugetti moraliditiva siluvapai palumaru - kaluguchundedi badha - valana dahamu nayena ||e papa|| ballidundagu bantu - ballemuna ni prakka - jilli bada bodachinada ullolamulavale nalla nirubukanga jallare gada kopamu ||e papa|| kata kata papa sam - katamu baputa kinta - patu badha nondinava etuvantidi prema - yetuvantidi santa - metula varnintu svami ||e papa||