నాకెంతో ఆనందం
Nakento Anandam
నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే || 2 || నాకెంతో ఆనందం… ఏ అపాయము నను సమీపించక ఏ రోగమైనను నా దరికి చేరక || 2 || నీవు నడువు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడితిరా || 2 || ||నాకెంతో|| నా వేదనలో నిన్ను వేడుకొంటిని నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని || 2 || నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా నా కన్న తండ్రివై కాపాడుచుంటివా || 2 || ||నాకెంతో|| నూతన యెరూషలేం నా గమ్యమేనని నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా || 2 || నీవుండు స్థలములో నేనుండ గోరెదను నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా || 2 || ||నాకెంతో||
nakento anandam ni sannidhi prabhuva nilo nenundute ade na dhan'yataye || 2 || nakento anandam... e apayamu nanu samipinchaka e rogamainanu na dariki cheraka || 2 || nivu naduvu margamulo na padamu jaraka ni dutale nannu kapaditira || 2 || ||nakento|| na vedanalo ninnu vedukontini na rodanalo niku morra pettitini || 2 || na kannitini tudichi ni kaugita cherchitiva na kanna tandrivai kapaduchuntiva || 2 || ||nakento|| nutana yerusalem na gamyamenani na koraku nivu sid'dhaparachuchuntiva || 2 || nivundu sthalamulo nenunda goredanu na vanchha adiye sri yesayya || 2 || ||nakento||