ఆకాశ పక్షులను చూడండి

Akasa Paksulanu Cudandi

28 Oct 2025

ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు అవి కోయవు గరిసెలలో దాచుకోవూ కొట్లలో కూర్చుకోవు ||ఆకాశ|| అనుదినము కావలసిన ఆహారము అందజేయును వాటికి ఆ దేవుడు కలసికట్టుగా అవి ఎగిరి పోతాయి కడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి ||ఆకాశ|| స్వార్ధము వంచన వాటికుండదు సాటివాని దోచుకొనే మనసు ఉండదు రేపటిని గూర్చిన చింత ఉండదు పూట ఎలా గడపాలని బాధ ఉండదు ||ఆకాశ|| పక్షులను పోషించే ఆ దేవుడు మనుష్యులను పోషించుట మానివేయునా సృష్టిలోన మనిషి బ్రతుకు శ్రేష్టము కదా ప్రభువు తోడు ఉండగా మనకు ఎందుకు బాధ ||ఆకాశ||


akasa paksulanu chudandi avi vittavu avi koyavu gariselalo dachukovu kotlalo kurchukovu ||akasa|| anudinamu kavalasina aharamu andajeyunu vatiki a devudu kalasikattuga avi egiri potayi kadupu nimpukonipoyi marala tirigi vastayi ||akasa|| svardhamu vanchana vatikundadu sativani dochukone manasu undadu repatini gurchina chinta undadu puta ela gadapalani badha undadu ||akasa|| paksulanu posinche a devudu manusyulanu posinchuta maniveyuna srstilona manisi bratuku srestamu kada prabhuvu todu undaga manaku enduku badha ||akasa||