యెహోవ నా మొర లాలించెను
Yehova Na Mora Lalincenu
యెహోవ నా మొర లాలించెను దన మహా దయను నను గనించెను || 2 || అహర్నిశల దీనహీనుడగు నా దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవ|| పిశాచి గడిమి బడగొట్టెను దన వశాన నను నిలువ బెట్టెను ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల నిశాంతమున జే ర్చి సేద దీర్చెను ||యెహోవ|| మదావలము బోలు నా మదిన్ దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్ యధేచ్చలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను ||యెహోవ|| అనీతి వస్త్ర మెడలించెను యే సునాథు రక్తమున ముంచెను వినూత్న యత్నమే ద నూని యెన్నడు గనన్ వినన్ బ్రే మ నాకు జూపెను ||యెహోవ|| విలాపములకు జెవి నిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగము పై కిలాగి నను సుఖ కళావళుల్ మన సులోన నిలిపెను ||యెహోవ|| అగణ్య పాపియని త్రోయక న న్ను గూర్చి తన సుతుని దా చక తెగించి మృతి కొ ప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను ||యెహోవ||
yehova na mora lalinchenu dana maha dayanu nanu ganinchenu || 2 || aharnisala dinahinudagu na du hayanedu dhvani grahinchi manipenu ||yehova|| pisachi gadimi badagottenu dana vasana nanu niluva bettenu prasanta madhura su visesa vakphala nisantamuna je rchi seda dirchenu ||yehova|| madavalamu bolu na madin dana pradipta vakyam kusa hatin yadhechchalanniti gudinchi papapu modal tudal nari ki dariki jerchenu ||yehova|| aniti vastra medalinchenu ye sunathu raktamuna munchenu vinutna yatname da nuni yennadu ganan vinan bre ma naku jupenu ||yehova|| vilapamulaku jevi nichchenu srama kalapamulaku selavichchenu silanagamu pai kilagi nanu sukha kalavalul mana sulona nilipenu ||yehova|| aganya papiyani troyaka na nnu gurchi tana sutuni da chaka teginchi mrti ko ppaginchi papapu negul digul soga suga nananchenu ||yehova||